కొత్త నీరు వస్తున్నప్పుడు.. పాత నీరు పక్కకు మళ్లిపోవలసిందే. ఎంత టాలెంట్ ఉన్నా -నవతరం ముందు తల వంచాల్సిందే. ప్రస్తుతం కాజల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తమన్నా, సమంత బ్యాచ్... కాజల్‌కి గట్టిపోటీ ఇస్తోంది. దాంతో గత నాలుగునెలల నుంచీ ఈ అమ్మడు ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోలేదు. బాద్‌షా తరవాత కెమెరా ముందుకు రాలేదు. ఎవడులో నటించింది. కానీ అతిథి పాత్ర మాత్రమే.
ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉంది కాజల్. కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌లో బాగా ఎంజాయ్ చేస్తోంది. ''కొన్ని నెలల పాటు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపాను. కాస్త అయినా విశ్రాంతి కావాలి కదా. పైగా నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వారితో కలిసి గడిపే అవకాశం ఇప్పుడే వచ్చింది. ఈక్షణాలను వృథా చేసుకోను'' అంటోంది.
కావాలని కాజల్ కొన్ని సినిమాలను వదులుకొంది. గబ్బర్ సింగ్ 2లో ఛాన్స్ వచ్చినా కాదంది. కమల్ హాసన్ పక్కన కథానాయికగాగా ఎంచుకొంటామన్నా తీరిక లేదంది. సడన్‌గా సినిమాలపై కాజల్‌కి ఎందుకింత విరక్తి వచ్చిందో నిర్మాతలకు కూడా అర్థం కావడం లేదు.