అవును నేను వేశ్య నే

ఈ మాటలంది ఎవరో కాదండి ఆవారపాన్, జిస్మ్2, మర్డర్2, ఆష్ఖి 2 సినిమాల్కి కధలు అందించి, త్వరలో అత్యాచారభాదితుల కధతో దర్శకురాలిగా మారబోతున్న షగుఫ్తారఫీక్. తను ఒక గొప్పింటి అబ్బాయి,పేద అమ్మాయిలకు పుట్టినదాన్నని, ఒకనటి కూతుర్నని చాలా పుకార్లు ఉండేవట. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే మాజీ బాలివుడ్ నటి అన్వరిభేగం పెంచిందట.

తనకోసం తన భర్తనే విడిచిపెట్టి, సర్వం దారపోసిన తల్లిని పోషించడానికి తను వేశ్య గా మారవలసి వచ్చిందని చెప్పింది. సినిమాకధలు రాయాలనుకొంటున్న సంగతి మొదట మహేష్ భట్కి చెప్పిందట, 2006 లో కలియుగ్ సినిమాలో కొన్ని సీన్స్ రాయడంతో మొదలైన తన రచనాప్రయాణం వరుస హిట్స్ తో సాగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెపుతుంది. జీవితాంత కాలం తన తల్లిని క్షేమంగా చూసుకోవడమే ముఖ్యమంటుంది. ఏమైనా మానవతావిలువలు కనుమరుగవుతున్న ఈరోజుల్లో పెంచిన తల్లి కోసం ఈత్యాగం గ్రేట్ కదా ?