సమంతకి స్టైలీష్ ట్రిక్కులు నేర్పుతున్న రచయిత సోదరి

పరుచూరి బ్రదర్స్ తరువాత టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ రైటర్ ఎవరంటే కోన వెంకట్ పేరే వినపడుతుంది. ఈ యన కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నేటి యువతరానికి నచ్చే విధంగా పంచ్ డైలాగ్స్ రాయడం ఈయన స్పెషాలిటి.

 ప్రస్తుతం టాలీవుడ్ ను దున్నేస్తున్న ఈ రచయిత గారి సోదరికూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. తన అన్నలా రచయితగా మాత్రం కాదు మరో రంగాన్ని ఎంచుకుంది. కోన వెంకట్ సోదరి కోన నీరజ స్టార్ హీరోయిన్ సమంతకు స్టైలిస్ట్ గా సలహాలు ఇస్తోంది. రీసెంట్ స్టిల్స్ విషయంలో మంచి నైపుణ్యం అవగాహన ఉన్న నీరజ సెలెబ్రెటీలకు స్టైలిష్ గా ఎలా ఉండాలో సలహాలు ఇస్తుందట .

 ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలలో సమంతను స్టైలిష్ గా చూపెట్టడానికి తన చెల్లి సలహాలు ఇస్తోందని కోన వెంకట్ స్వయంగా తన ట్విటర్ లో తెలిపాడు. అన్న రచయిత, చెల్లి స్టైలిష్ ఎడ్వైజర్ గా టాలీవుడ్ ని ఎలేస్తున్నారు ఈ అన్నాచెల్లెళ్ళు...