Psycho Movie Review

Rating : 0.75/5
చిత్రకథ :
మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాస్త సింపుల్ గా చెప్పెస్తానే.. మీరా(నిషా కొఠారి) ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని పోషిస్తూ ఉంటుంది. ఒకరోజు తనకి బస్ లో నిఖిల్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. కొద్దిరోజులకి నిఖిల్ మీరాని తనతో సినిమాకి రమ్మని, ఫోన్ లో చాట్ చేయమని టార్చర్ మొదలు పెడతాడు. దాంతో ఆమె అతని నుంచి తప్పించుకోవాలని ప్రత్నిస్తుంటుంది. దాంతో అతను ఇంకా సైకోగా మారి వారి ఫ్యామిలీకి ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. దాంతో మీరా తన ఆఫీస్ లో పనిచేసే శేఖర్ కి చెప్పి హెల్ప్ అడుగుతుంది. శేఖర్ సిటీ కమీషనర్(మిలింద్ గునాజ్) సాయం కోరుతాడు. మొదట్లో లైట్ తీసుకున్న అతను ఓ సంఘటనతో కేసుని సీరియస్ గా తీసుకుంటాడు. అదే టైములో సైకో నిఖిల్ మీరాని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసిన మీరాని సైకో చంపేశాడా? లేక కమీషనర్ ఈ లోపు ఆ సైకోని బందించాడా? లేకపోతే ఈ రెండింటికీ అతీతంగా ఇంకేమన్నా సంఘటనలు చోటుచేసుకున్నాయా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి. 

నటీనటుల ప్రతిభ :
నిషా కొఠారి నటన భయపడే సీన్స్ లో బాగా నటించింది. కమీషనర్ గా మిలింద్ గునాజ్ మెప్పించాడు. సినిమాలో కీ రోల్ చేసిన సైకో పాత్రధారి ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడనే చెప్పాలి. శేఖర్ పాత్రదారి నటన జస్ట్ ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకి మొదటి మైనస్, చివరి పెద్ద మైనస్ సినిమాటోగ్రఫీ. రామ్ గోపాల్ వర్మ రోగ్ మెథడాలజీ ఉపయోగించి 'గో ప్రో', '5డి' కెమెరాలతో తీసిన 'డిపార్ట్ మెంట్' సినిమా చూసి ఆ కెమెరా యాంగిల్స్ ఏందీ? వర్మకి ఏమన్నా మెంటల్ ఎక్కిందా?అని పిచ్చ భూతులు తిట్టుకున్న వారే ఎక్కువ ఉంటారు. అంతలా ఫ్లాప్ అయినా సరే మళ్ళీ అదే రోగ్ మెథడాలజీతో ఈ సినిమా తీయడం బిగ్గెస్ట్ మైనస్. నాకు తెలిసి మా గురువు గారు వర్మకే  అంత తిక్కుంటే మాకెంత ఉండాలి అనుకున్నారేమో ఆయన శిష్యులు మళ్ళీ ఆ అట్టర్ ఫ్లాప్ మెథడ్ ని వాడి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకి కళ్ళు బైర్లు కమ్మేలా, మైండ్ బ్లాక్ అయ్యేలా ఈ సినిమా చేసారు. సినిమాలో పెట్టిన కెమెరా యాంగిల్స్ వల్ల కడుపులో తిప్పేసి కొంతమంది బయటకి వచ్చి వాంతులు చేసుకున్నా పెద్ద ఫీలవ్వాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ తోడు ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు, ఇద్దరు ఎడిటర్లు పనిచేయడం వల్ల సినిమా ఎన్ని విధాలా నాశనం అవ్వాలో అన్ని విధాలా నాశనం అయ్యింది. ఈ సినిమాకి వర్మ అందించిన కథలో సొసైటీకి మెసేజ్ ఉందని అన్నారు కానీ సినిమా చివరి దాకా చూస్తే సైకోలుగా మీరే మారిపోయినా పెద్దగా ఆశ్చర్య పోనక్కరలేదు. స్క్రీన్ ప్లే చాలా చెత్తగా ఉంది. ఉదాహరణకి ఇప్పట్లో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కాస్తో కూస్తో తెలిసన బుడ్డోన్ని థియేటర్లో కూర్చో బెడితే తర్వాతి సీన్ ఏమిటనేది అడిగితే ఇట్టే చెప్పేస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉందో.. దర్శకత్వం జస్ట్ బిలో యావరేజ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కి డైరెక్టర్ ఏమి చెప్పాడో కానీ డైలాగ్స్ వస్తున్నప్పుడు కూడా డైలాగ్స్ కంటే సౌండ్స్ మాత్రమే వినిపించాలి అనే రేంజ్ లో బీట్స్ కొట్టి థియేటర్లో ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించాడు.

హైలెట్స్ : 
పరవాలేదనిపించే నిషా కొఠారి, సైకో పాత్రదారి నటనలు తప్ప ఎంత బుర్ర పగల కొట్టుకున్నా మరో హైలైట్ దొరకడంలేదు.

విశ్లేషణ : 
నాకెందుకో ఎంచుకున్న కథ ద్వారా సొసైటీకి ఏదో చెప్పాలనుకున్నాడు, ఒరిజినల్ గా అయితే కథని హైదరాబాద్లో మొదలు పెట్టి విజయవాడలో ముగించాలి కానీ హైదరాబాద్లో మొదలు పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి గంగానదిలో కలిపేసాడు. అసలు ఆ సైకో గాడు ఎందుకు అలా చేస్తున్నాడు, వాడు ముందు నుంచి అంతేనా లేక మధ్యలో అలా మారాడా అనే విషయాలపైన క్లారిటీ ఇవ్వలేదు. చివరికి నిషా సైకోలా బిహేవ్ చెయ్యడం ఎంతవరకూ జస్టిఫికేషన్ అనుకున్నాడో తెలియదు గానీ, ఆడియన్స్ మాత్రం దాన్ని జీర్ణించుకోలేక వామిట్ చేసెయ్యడం గ్యారంటీ. సినిమా మొత్తం మీద నవ్వడానికి ఓ సీన్ ఉండదు, అలాగని థ్రిల్ ఫీలవ్వడానికి ఛాన్స్ ఉండదు. మామూలుగా వర్మ నుంచి ఎన్నో పనికిమాలిన చెత్త సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ఆ లిస్ట్ టాప్ 5లో ఉంటుందని చెప్పడం కొసమెరుపు.

చివరగా : 
ఓ సైకో వల్ల అమ్మాయి పడే భాధ చూపిస్తానని చెప్పి థియేటర్ కి వచ్చిన వాళ్ళని సైకోలుగా మార్చడమే ఈ సినిమా మొదటి, చివరి లక్ష్యం. మీరు సైకో కావాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ సినిమా చూడండి.