"అత్తారింటికి దారేది" స్టోరీ తెలిసిపోయిందోచ్..!!



ఇప్పడివరకు డైలాగ్ లే విన్నాము ఇప్పుడు ఏకంగా కథ తెల్సిపోయింది.ఈ సినిమాలో ప‌వ‌న్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందటా!!.

ప‌వ‌న్ ఒక మిలీయ‌నీర్‌. తాత‌య్య బొమ‌న్ ఇరానీతో క‌ల‌సి విదేశాల్లో ఉంటాడు. ఇండియాలో త‌న‌కో కుటుంబం ఉంద‌ని, ఓ అత్త‌య్య (న‌దియా) ఉందని తెలుస్తుంది. అయితే... త‌మ రెండు కుటుంబాల‌కూ ఓ త‌గాదా ఉంద‌ని కూడా అర్థ‌మ‌వుతుంది. దాన్ని తీర్చ‌డానికి ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డ స‌మంత‌ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు.

ఇంత‌కీ స‌మంత‌ ఎవ‌రో కాదు.. స్వ‌యానా మ‌రద‌లు. అత్త‌య్య మ‌న‌సు మార్చ‌డానికి ఆ ఇంట్లోనే ప‌వ‌న్ డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. ఆ త‌ర‌వాత ఏమైంది?? అనేదే ఈ సినిమా క‌థ‌. మిలియ‌నీర్ నుంచి డ్రైవ‌ర్‌గా మారిన ప‌వ‌న్ ప‌డే పాట్లూ, అత్త‌మ్మ‌ని దారిలోకి తెచ్చుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు వినోదాత్మ‌కంగా ఉంటాయ‌ట‌. మరి ఈ వినోదాల విందు ని ఆస్వాదించాలంటే  ఆగ‌స్టు 9 వ‌ర‌కూ ఆగాల్సిందే!!

ENGLISH VERSION:-
"attarintiki dharedhi" Leaked story
                                                Source: apherald.com