బలుపు హీరోయిన్ అంజలి అరెస్టుకు రంగం సిద్దం

తెలుగు సినీరంగంలో వెంకటేష్, రవితేజ వంటి అగ్రహీరోల సరసన హీరోయిన్ గా నటించి తక్కువ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన అంజలి. ఆమెను అరెస్థు చేయకపోవడం పై చెన్నై కోర్టు పోలీసులకు అక్షింతలు వేయడంతో ఇక అంజలి అరెస్టు రేపోమాపో జరగనుందని సమాచారం.

అంజలి కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెల్లిపోయి పిన్ని, దర్శకుడు కళైంజల్ పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ హైడ్రామాకు తెరదించి, ఆతర్వాత ఆ విషయంలో అంజలి అభాసుపాలయింది. ఇటు సినీ ఇండస్ట్రీలోను పరువు పోయినంత పని కాగా, పోలీసులతో కూడా చీవాట్లు తిన్నదట.


ఆతర్వాత ఆమె పిన్నితో వివాదాన్ని పరిష్కరించుకున్నప్పటికి దర్శకుడు కళైంజల్ అంజలిపై చెన్నై కోర్టులో పరువునష్టం దావా వేసారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఈ కేసు విషయంలో అంజలిని హాజరు కావాల్సిందిగా కోరినప్పటికి నేను బిజీ, నాఅంత సెలిబ్రిటీ కోర్టుకు రాలేదు అని అంటూ హాజరు కాలేదు. కనీసం కోర్టును గౌరవించే విధంగా కూడా తన లాయరుతో తన గైర్హాజరు పిటిషన్ వేయించలేదు.


దీంతో ఇటీవల ముచ్చటగా మూడోసారి కూడా కోర్టుకు అంజలి హాజరుకాకపోవడంతో ఆమె అరెస్టుకు సమన్లు జారీ అయ్యాయి. అంతే కాదు, అంజలి కళ్లెదుటే షూటింగుల్లో పాల్గొంటుంటే కూడా ఆమెను కోర్టుకు హాజరు పర్చలేక పోతున్నారు అంటూ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్థం చేసిందట. అందుకే ఇక అంజలి జైలు కెల్లక తప్పదు అంటున్నారు.