అంజ‌లిని మ‌ళ్లీ ఇరికించేశారు

అంజ‌లి...... తెలుగు ప్రేక్షకులకు ప‌రిచయం అక్కర్లేని పేరు.  జ‌ర్నీతో తెలుగు ప్రేక్షకులను ప‌ల‌కరించి, సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో సీత‌గా మరింత ద‌గ్గర‌యిన బ్యూటీ అంజ‌లి. కానీ బ్యాడ్ ల‌క్  ఏంటంటే పేరుకి త‌గ్గట్టే త‌రువాత రియ‌ల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది అంజ‌లి.

నిజం చెప్పాలంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి లా వుంది అంజ‌లి ప‌రిస్ధితి. పిన్ని భార‌తీ, డైరెక్టర్ క‌ళంజియం త‌న‌ని వేది్స్తున్నార‌ని, ఏటియంలా వాడుకున్నార‌ని అజ్క్షాతంలోకి వెళ్లి అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించిన అంజ‌లి. అయితే ఆ త‌ర‌వాత అంజ‌లిపై డైరెక్టర్ క‌ళంజియం ప‌రువు న‌ష్టం దావా వేయడం, ఆమె కోర్టు వాయిదాల‌కు అటెండ్ అవ్వక‌పోవ‌డం చివ‌రికీ అరెస్ట్ వారెంట్ దాకా వ‌చ్చేసింది ప‌రిస్ధితి  .ఈనెల‌9న కోర్టుకు హాజ‌రుకాక‌పోతే అరెస్ట్ చేయడం ఖాయ‌మ‌ని తెలిసిన అంజ‌లి రాజీ కొచ్చిన‌ట్టు స‌మాచారం.  డైరెక్టర్ క‌ళంజియంతో కేసు విత్ డ్రా విష‌యంలో ఆమె ఫిన్ని భార‌తీ మ‌ద్య వ‌ర్ధిత్వం చేసిన‌ట్టు కోలీవుడ్ స‌మాచారం.
 
ఆ రాజీలో భాగంగా క‌ళంజియంకు నాలుగు సినిమాల‌ని, త‌న ప్రతి సినిమా రెమ్యూన‌రేష‌న్ లో 25% ఇవ్వాల‌ని, లేక‌పోతే  ప్రేమించిన‌వాడిని వ‌ద‌లేసి పెళ్లి చేసుకోవాల‌ని కండిష‌న్స్ పెట్టార‌ట‌. ఆలోచ‌న‌లో వున్న అంజ‌లిని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తాన‌ని క‌ళంజియంతో  భార‌తి చెప్పిన‌ట్టు స‌మాచారం. సీన్ అంతా చూస్తుంటే గ‌తంలోనూ అంజ‌లిని ఇదే టైపులో వేదించి వుంటార‌ని అర్దమవుతోంది. కానీ కేసులో ఇరుక్కున అంజ‌లికి మ‌రో మార్గం వుందా...?లేక రాజీకి వ‌స్తుందా? రాజీలో భాగంగా పెళ్లి చేసుకుంటుందా..? అన్నది మ‌రో రెండు రోజుల్లో తేల‌నుంది.