విడుదలకు సిద్దమైన సాహసం..!!

 ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు పడి పడి చివరికి గోపీచంద్ "సాహసం" విడుదలకు సిద్దమయ్యింది. గోపీచంద్, తాప్సీ జంటగా నటించిన "సాహసం" చిత్రం జూలై 12న విడుదల కానుంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.


చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అద్భుతమైన ప్రేక్షాకాదరణ పొందుతుంది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.