ఇక నుంచి కథని బట్టి సంగీతం..: ఎ అర్ రహమాన్!!!

చెన్నై : ఇక నుంచి తాను కథ ను బట్టే సంగీతం అందిస్తానని, కొత్త తరహా కథలకే ప్రయారిటీ ఇస్తానని రహమాన్ తేల్చి చెప్పారు. ఫైన్‌ ఫోక్స్‌ పతాకంపై ఆజూ, సౌందరరాజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నెడుంజాలై'. 'నెడుంజాలై' ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. 'ఇసై పుయల్‌' ఏఆర్‌ రెహ్మాన్‌, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎ ఆర్ రహమాన్ మాట్లాడారు.

ఏఆర్‌ రెహ్మాన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పది సినిమాలకు సంగీతం సమకూర్చుతున్నా. తమిళంలో భిన్నమైన కథలకు మాత్రమే స్వరాలు అందించాలని నిర్ణయించుకున్నా. ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందని చెప్పారు.


మురుగదాస్‌ మాట్లాడుతూ.. దర్శకుడు కృష్ణ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. కొత్తవారికి అవకాశమిచ్చే గుణం ఎంతో నచ్చిందని చెప్పారు.


స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌, యువ సంగీత సంచలనం యువన్‌శంకర్‌ రాజా ఒకే చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు. అయితే స్వరాలు సమకూర్చటంలో కాదు. మరి ఏ విషయంలోనంటారా? ఆస్కార్‌ ఫిలింస్‌ రవిచంద్రన్‌ నిర్మాణంలో ధనుష్‌ హీరోగా భరత్‌బాలా తెరకెక్కిస్తున్న చిత్రం 'మరియాన్‌'. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు.


ఈ సినిమా కోసం ధనుష్‌ ఓ పాట రాశాడు. దాన్ని యువశంకర్‌ రాజా ఆలపించాడు. గతంలో తన సంగీత సారథ్యంలోనే ధనుష్‌కు చాలా పాటలు పాడిన యువన్‌ తొలిసారిగా మరొకరి సంగీతంలో గళంవిప్పాడు. అలా స్వరమాంత్రికుడితో జట్టు కట్టాడు. వారి కలయికలో రూపొందిన ఈ పాట జనాల్ని విశేషంగా అలరిస్తుందని దర్శకుడు భరత్‌బాలా ధీమా వ్యక్తం చేశాడు. ఈ పాట ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.