యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లెటెస్ట్ ఫిల్మ్ రామయ్యా వస్తామయ్యా. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హరిస్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీ, అటు అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుడ్డోడు తెరపై కనిపిస్తాడట.
మరి ఇంతకీ టైటిలేమో క్లాస్ గా వుంది....అందులోనూ ఫ్యామిలీ సినిమాలు తీయడంలో దిట్ట అయిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు కదా అని మీరు ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటున్నారేమో.? కానీ ఇది పక్కా మాస్ ఫిల్మ్ అంటున్నాడు డైరెక్టర్ హరిస్. ఇక యంగ్ టైగర్ మాస్ సినిమా అంటే మామూలుగా వుంటాయా ఛేజ్ సీన్స్. నందమూరి అభిమానులు ఏ మాత్రం డిస్ పాయింట్ అవ్వకుండా ఇప్పటికే రెండు ఛేజింగ్ సీన్స్ మైసూరులోని ఓ టెంపుల్ లో షూట్ చేశారట.
ప్రతి సినిమాలో ఏదో ఒక ఆయుదంగా శత్రు సంహారం చేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో గొడ్డలి పట్టి వేటాడేస్తాడట. అందుకు నిదర్శనమే ఈ లీకైన ఫోటోస్. ఇక ఈ సినిమాలోని మరి కొన్ని యాక్షన్ సీన్స్ చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో షూట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఆగస్టు7న సినిమా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వుంటుందని ఫిల్మ్ నగర్ కబర్.
source: apherald.com
No comments:
Post a Comment