రాజమౌళి, వినాయక్, పూరి వీళ్ళంతా అందరి పెద్ద హీరోలతో సూపర్ హిట్స్
ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్. వీళ్ళు డేట్స్ ఇస్తానంటే బ్లాంక్ చెక్స్
ఇవ్వడానికి నిర్మాతలు రెడీ. ఇప్పుడు వీళ్ళ ఆధిపత్యానికి గండి పడబోతుందా?
చూస్తే అవుననే అనిపిస్తుంది.
రైటర్ గా పరిచయమైన కొరటాల శివ ఫస్ట్ టైం ప్రభాస్ హీరోగా మాస్ మషాలా దట్టించి “మిర్చి”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, ఈ హిట్ తో మనోడి రేమ్యూనరేషన్ కోటి దాటేసింది, డేట్స్ కోసం నిర్మాతలందరూ శివ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు, బండ్ల గణేష్ ఐతే ఒక అడుగు ముందుకేసి అడ్వాన్సు ఇచ్చేసి రాంచరణ్ తో సినిమాని ఓకే చేసేసాడు. ఈరోజుల్లో, బస్టాప్, ఒక ప్రేమ కధాచిత్రం” వంటి వరుస విజయాలతో మంచి కిక్ మీద వున్నమరో డైరెక్టర్ “మారుతి “, “ఒక ప్రేమ కధాచిత్రం”సినిమాకి దర్శకుడు కానప్పటకి హీరో సుదీర్ బాబు కి అన్ని తానై హిట్ ఇచ్చాడు. తాజాగా అల్లువారబ్బై “శిరీష్” కి “కొత్తజంట” ని వెతికే పనిలో పడ్డ మారుతి కి నెక్స్ట్ రామ్చరణ్ తో మూవీ వున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరూ బిజీ ఐతే మనం ఖాలీ అవడంఖాయం అని స్టార్ డైరెక్టర్స్ కంగారుపడుతున్నారంట.