పవన్ వలనే వారు హిట్ అవుతున్నారా....?

టాలీవుడ్లో వరుసగా ఫ్లాప్ అవుతున్న హీరోలకి పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కు అయ్యాదనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాలకు పవన్ పేరును వాడుకోవడం ఓ సెంటిమెంట్ అయ్యింది. 

కొన్ని ఉదాహరణలు చూస్తే ఇది నిజమనిపిస్తుంది. ఆమధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్న హీరో నితిన్ పవన్ పేరు ఇమేజ్ ని వాడుకొని వరుసగా హిట్ అవుతూ వస్తున్నాడు. ఆ తర్వాత కొంతమంది హీరోలు అతని పేరును గబ్బర్ సింగ్ లోని అంత్యాక్షరి సీన్స్ పెట్టి హిట్ అయ్యారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ్ నటించిన 'బలుపు' సినిమాలో పవన్ ని వాడుకున్నాడు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ కే వెళ్ళింది.

అసలు నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అతని పేరు అవసరం లేకున్నా సెంటిమెంట్ గా పెట్టారు. ఆ సెంటిమెంట్ బాగానే ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ విషయం ఫిల్మ్ నగర్లో చర్చనీయంశంగా మారింది. మరికొన్ని రోజుల్లో చాలా సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు వినిపించే సన్నివేశాలు సినిమాల్లో ఉంటాయని సమాచారం