అద్భుతమైన బాణీలు అందిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షిస్తూ
ప్రస్తుతం బిజీగా ఉన్న సంగీత దర్శకుడి తమన్ ఇప్పుడు రూటు మారుస్తానని
అంటున్నాడు. ఇప్పటివరకు ఫాస్ట్ బీట్ రాక్ వంటి పాటలకే ఎక్కువగా సంగీతం
అందించిన తమన్ దృష్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ కథ సినిమాలపై పడింది.
అంతేకాక ఎప్పుడూ రెండు ప్రేమ కథలు తన చేతిలో ఉండాలని కోరుకుంటున్నాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ " ప్రేమ కథా సినిమాకు మెలోడి
ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అటువంటి పాటలకు ఎక్కువకాలం ప్రేక్షకుల
హృదయాల్లో ఉంటాయి. అందుకే ఇకపై నేను ప్రేమకథలపై దృష్టి పెట్టాలని
అనుకుంటున్నా. ఓ సంగీత దర్శకుడికి ఎప్పుడూ రెండు ప్రేమకథా చిత్రాలు చేతిలో
ఉండాలి" అని చెప్పాడు. ప్రస్తుతం తమన్ 'ఎవడు' 'రేసు గుర్రం' 'ఆగడు'
సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.