కొందరు ఏమీ చేయకుండానే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొందరికి ఎంత ప్రయత్నించినా అదృష్టం కలసి రానేరాదు. లక్ష్మీరాయ్ ఆ రెండో కోవకు చెందిన వ్యక్తే. ఇండస్ట్రీలో లెగ్ పెట్టి చాలా కాలమే అయినా, ఇంతవరకూ సాధించింది ఏమీ లేదు. మొత్తానికి మన తెలుగువాళ్లు ఆమెను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బలుపు లో చిన్నపాటి చాన్స్ వచ్చింది పిల్లకి. దానికే ఎగిరి గంతేసింది.
ఇప్పుడు సినిమా రిలీజయ్యాక ఇంకా ఆనందంతో గెంతుతోంది. ఏంటి విషయం అంటే... ఈ సినిమాలో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ సూపర్ హిట్టయ్యిందట. తన పాట వస్తున్నప్పుడు థియేటర్లో ఈలలే ఈలలట. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారట. అంటే, తాను సక్సెస్ అయినట్టే అంటోంది. ఆమె గప్పాలు విన్నవాళ్లంతా నవ్వుకుంటున్నారు. దీనికే ఇంత ఆనందం అవసరమా అంటున్నారు. ఎందుకంటే, బలుపు సినిమాయే యావరేజ్ టాక్ తెచ్చకుంది. అందరూ ఐదుకి మూడు పాయింట్లే వేశారు.
ఇక ఈమె పాట గురించి అంతగా ఎవరూ మాట్లాడేసుకుంటున్నట్టు కనిపించడమే లేదు. మరి ఈవిడెందుకు ఇంత మురిసిపోతున్నట్టు! ఎందుకంటే, ఈమె ఆనందానికి కారణం వేరే ఉంది. శ్రీశాంత్ వివాదంలో మొదట చిక్కుకున్నది మన పిల్లే. దాన్నుంచి అందరి దృష్టీ మరల్చడానికి, మర్చిపోయేలా చేయడానికి ఈమె ఇలా సినిమా గురించి అడిగినవారికీ అడగనివారికీ చెప్పి డైవర్ట్ చేస్తోందట. పిల్ల తక్కువదేం కాదండోయ్!