శ్రుతి బాగా చెడిపోయింది

క‌థానాయిక అన్నాక‌.... గ్లామ‌ర్ పాత్ర‌లవైపు మొగ్గు చూప‌డం స‌హ‌జ‌మే!  సెక్సీ చూపులు, అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లూ ఇవ‌న్నీ కావ‌ల్సిందే. ఇవ‌న్నీ క్ర‌మ‌క్ర‌మంగా తెలుసుకొంటోంది శ్రుతిహాస‌న్‌!  ఇది వ‌ర‌కు అభిన‌య ప్ర‌ధాన‌మైన పాత్ర‌లొస్తేనే చేస్తా - అని గిరిగీసుకొని కూర్చున్న శ్రుతి ఆ త‌ర‌వాత పంథా మార్చింది. బ‌లుపులో పూర్తిగా మారిన శ్రుతిహాస‌న్ క‌నిపించింది.

క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌కి కావ‌ల్సిన ల‌క్ష‌ణాలు ఒంట‌బ‌ట్టించుకొంది శ్రుతి. లేదంటే ఇప్పుడున్న పోటీ ప్ర‌పంచంలో నెగ్గుకురావ‌డం క‌ష్టం అనుకొంటోంది. అందుకే బ‌లుపులో పూర్తిగా బ‌య‌ట‌ప‌డిపోయింది. డీ-డేలో అయితే రెచ్చిపోయింది. అర్జున్ రాంపాల్‌తో ఓ శృంగార గీతంలో జీవించింది. ఇప్పుడు ఎవ‌డులో కూడా ఇదే తర‌హా.. అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌ట‌.

ఇప్పుడు త‌న దగ్గ‌ర‌కు వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌తో  ''గ్లామ‌ర్ మిక్స్ చేసిన పాత్రలుంటే చెప్పండి.. చేస్తా..'' అంటోంద‌ట‌. ఇవ‌న్నీ చూసి శ్రుతి ఎంత మారిపోయింది?  అని కొంద‌రు ముక్కున వేలేసుకొంటే - క‌మ‌ల్ హాస‌న్ అభిమానులు మాత్రం శ్రుతి బాగా చెడిపోయింద‌ని తెగ ఫీలైపోతున్నారు.