బాలివూడ్ నే తన దగ్గరికి రప్పిస్తున్న ప్రిన్స్..!!


టాలివూడ్ నుంచి బాలివూడ్ కి వెల్లే ఈరొజుల్లో ప్రిన్స్ మహేష్ బాలివూడ్ సుందరంగులనే తన దగ్గరికి రప్పిస్తున్నాడు.. మరి ప్రిన్సా మజాకా..!! మహేష్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న "శివం" అనే చిత్రం చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను ఎంపిక చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి రానుంది.

మహేష్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో "ఆగడు" అనే చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ అమ్మడు నటించే మొదటి తెలుగు చిత్రం మహేష్ తో కావడం వల్ల అభిమానులతో పాటు దీపిక కూడా ఎదురు చూస్తుందట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.