చర్రీ, చిరులకి పవన్ మెగా పవర్ పంచ్..!!


మెగాస్టార్ చిరంజీవికి తన సోదరుడు పవణ్ కళ్యాణ్ ఇస్థున్న పవర్ పంచ్ ఎఫెక్ట్ బాగానే పడుతోంది. రాజకీయంగా ఇబ్బంది పెడుతుండడమే కాకుండా, అటు సినీ ఇండస్ట్రీలో కూడా తనముడు రాంచరణ్ పై కూడా పవణ్ ప్రభావం పవర్ ఫుల్ గానే పడుతోంది అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు.

చిరంజీవి కేంద్రపర్యాటక శాఖ మంత్రిగా ఉత్తరాఖండ్ విలయం సంధర్బంగా బాదితులకు సహాయం కోసం స్పందించకముందే ఎలాంటి రాజకీయాలతో సంబందం లేకున్నా
ఓ సినిహీరోగా, మనసున్న మనిషిగా పవణ్ కళ్యాణ్ స్పందించి 24లక్షలు విరాళ మిచ్చారు. సంబతిత శాఖ మంత్రిగా, సినీరంగంలోను పవణ్ కంటే ప్రముఖునిగా ఉన్న చిరంజీవిని పవణ్ స్పందన అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో కాస్థా ఇబ్బంది పెట్టింది.

పవణ్ తన విరాళం చిరంజీవి ద్వారా అందించకుండా నేరుగా ప్రకటించడంతో చిరు కు పవణ్ కు మద్య అంతరం ఉందన్న విషయం కూడా మరో సారి బహిర్గతం చేసినట్టయింది.
చిరంజీవి కాంగ్రేస్ లో చేరినప్పటినుంచి పవణ్ అన్నతో విభేదిస్థున్నాడని, అందుకే దూరంగా ఉంటున్నారని, ఓదశలో పవణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసి టిడిపి లోకి వెలుతున్నారన్న వదంతులను కూడా సృష్టించడం చిరంజీవి రాజకీయ కష్టాలు తెచ్చిపెట్టింది.

తాజాగా కొడుకు రాంచరణ్ నటించిన ఎవడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా ఏర్పాటు చేసారు. దీనికి మెగా ఫ్యామిలీ అంతా రావడమే కాకుండా అల్లు పరివారం కూడా హాజరైంది.
అయితే మెగా కుటుంబంలో కీలకమైన ఆయన సోదరులు నాగబాబు, పవణ్ కళ్యాణ్ రాకపోవడంతో సినీ వర్గాల్లో మరోసారి చిరంజీవి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆ ఫంక్షన్ లో అభిమానులు కూడా పవణ్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తించడంతో చిరంజీవికి ఏంచేయాలో పాలుపోలేదు.

అయితే పవణ్ కళ్యాణ్ షూటింగ్ నిమిత్తం స్పెయిన్ లో ఉండడంతో రాలేదని సర్దుబాటు చేసుకున్నారు కాని నాగబాబు కూడా రాకపోవడంతో ఆ మేకప్ సరిపోలేదంటున్నారు సినివర్గాలు. ఏది ఏమయినా చిరంజీవి రాజకీయాలు ఆయనను మెగా కుటుంబంలో ఒంటరి వాన్ని చేసాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు కూడా.