రాక రాక తెలుగు పరిశ్రమకి ఒక తెలుగమ్మయి దొరికిందని సంబరపడిపోతుంటె ఈ అమ్మడు పై గాసిప్స్ చక్కర కొడ్తున్నాయి.. "ప్రేమకధా చిత్రం" ద్వార ఎంతో ఫేం ని సంపాదించిన ఈ అమ్మడు అమాంతం బారిగా రెమ్యూనరెషన్ పెంచేసింది. తెలుగువారికి అవకాశాలు ఇవ్వడంలేదు బొంబాయి అమ్మాయిలను దిగుమతి చేసుకుంటున్నారు అని మన నిర్మాతలపై ఒక దురాభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో ఒక తెలుగు అమ్మాయి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలి అంటే చాలా తెలివిగా వ్యవహరించాలి.
కాని నందిత మాత్రం తనకు ఎవరూ ఎక్కువ పారితోషికం ఇస్తే వారికే తన ఓటు అంటూ చెప్పెయడమే కాకుండా అవసరాన్ని బట్టి ఎంత గ్లామరస్ గా కావాలంటే అంత గ్లామరస్ గా నటిస్తానని నందిత చెపుతూ ఉండడంతో మలయాళ సినిమా పరిశ్రమ నందితపై ఆశక్తి పెంచుకోవడమే కాకుండా ఆమెకు రెండు బడా ఆఫర్స్ కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. నందిత కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న పద్ధతిలో ఆ రెండు మలయాళ సినిమాలకు ఒకే అందట.
అంతే కాదు ప్రేమకథా చిత్రం హిట్ కావడం తొ ఒక్కసరిగా ఎ అమ్మడు లెవెల్ పెరిగిపొయిందట..!! షూటింగ్ లకి లేట్ గా వెళ్తుందట, ఈ మధ్యన ఇటువంటి సంఘటన ఒకటి జరగడం తో ఆమె గురించి ఎదురు చూసి ఓపిక నశించి ఒక సినిమా షూటింగ్ ను కాన్సిల్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి.
కేవలం రెండు సినిమాతోనే నందిత కు ఇంత లెవెల్ పెరిగిపోతే భవిష్యత్ లో ఆమె కెరియర్ బాగా దెబ్బ తింటుందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. చాలాకాలానికి తెలుగు అమ్మాయి దొరికిందని ఆనంద పడుతున్న తెలుగు నిర్మాత ఆనందాన్ని నందిత ఎక్కువ కాలం కొనసాగించదేమో అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే నందిత కూడా టాలీవుడ్ స్క్రీన్ నుండి చేజారిపోయినా ఆశ్చర్యం లేదు.