హైదరాబాద్ లో బాలయ్య హల్ చల్..!!



నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అవ్వాలి కానీ జూలై 15 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దుబాయ్ లో షూటింగ్ చెయ్యడానికి కొన్ని అనుమతులు రాకపోవడం వాటి కోసం మరింత సమయం పడుతుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం బాలకృష్ణ బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ కోసం ఫండ్ రైస్ చేయడం కోసం అమెరికాలో ఉన్నారు. ఈ సినిమా 2014 ఎలక్షన్స్ సమయానికి ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాలకృష్ణ ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా కనిపించనున్నాడో అంతే స్టైలిష్ గా కనిపించనున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ సినిమా దాన్ని మించి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.