ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నుండి బయటపడిన కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్
సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఇరుక్కోక మునుపే
శ్రీశాంత్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి.
శ్రీశాంత్‌కు క్రికెటర్‌గా మంచి ఇమేజ్ ఉంది కాబట్టి అతడితో సినిమా తీస్తే బాగా క్యాష్ చేసుకోవచ్చునని సినిమా వాళ్లు భావించారు. దీంతో 2009లోనే ఇతడు హీరోగా ఒక సినిమా ప్రారంభంకానుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో అది ఆగిపోయింది. అప్పట్లో శ్రీశాంత్ క్రికెటర్‌గా బిజీగా ఉండటంతో ఆ సినిమా ఆగిపోయిందన్నారు.
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఇప్పట్లో శ్రీశాంత్ క్రికెట్ ఆడే సూచనలు లేవు కాబట్టి శ్రీశాంత్ సినిమా తీయడానికి ఇదే సరైన సమయం అని మలయాళీ సినిమా వాళ్లు భావిస్తున్నారట. ఈ మేరకు అతనితో సినిమా తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. శ్రీశాంత్‌ని హీరోగా పెట్టి రూపొందించబోయే సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుందని, ఇందులో ప్రభుదేవా, ప్రకాశ్‌రాజ్‌లు కూడా ముఖ్యపాత్రలు చేస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమాకి 'బిగ్ పిక్చర్' అనే పేరు పెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.