కొద్ది
రోజులుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. అత్తారింటికీ దారేదీ
ఆడియో ఫంక్షన్ కాన్సిల్ అవ్వడమే దానికి రీజన్ అని వేరే చెప్పనక్కర్లేదు.
బాద్ షా ఆడియో ఫంక్షన్ విషాదం అవ్వడంతో అత్తారింటికీ దారేదీ ఆడియో ఫంక్షన్
వద్దని పవన్ వారించడమే ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురి
చేస్తోంది. నిజానికి జల్సా కాంబినేషన్ కావడంతో అత్తారింటికీ దారేదీపై
భారీ అంచనాలు పెట్టుకున్నారు అంతా. అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
...సో ఎక్స్ ఫెక్టేషన్స్ పీక్ లో వుంటాయని వేరే చెప్పాలా.? అందుకే
ఫంక్షన్ పెడితే కుమ్మేద్దాం...మెగా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిద్దాం
అనుకున్నారు ఆయన అభిమానులు. కానీ ఆడియో ఫంక్షన్ కాన్సిల్ అనేసరికీ
నీరుగారిపోయారు.
అయితే ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ఏంటంటే అత్తారింటికీ దారేదీ ఆడియో ఫంక్షన్ నిర్వహించడం ఖాయమట. ఫ్యాన్స్ ఫీలవుతున్నారని, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఫంక్షన్ చేద్దామని డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రొడ్యుసర్ బి.వి.యస్.ఎన్ ప్రసాద్ పవన్ ని ఒప్పించారట. సో అత్తారింటికీ దారేదీ ఆడియో ఫంక్షన్ ఈనెల 14న జరగడం కన్ ఫమ్. మెగా అభిమానులారా ఇపుడైనా కాస్త నవ్వండి మరి.