సినిమాలకి గుడ్ బాయ్ చెప్పెసిన సమంత..!!


స‌మంత బాంబు పేల్చింది. సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతుంద‌ట‌. అయితే ఇప్పుడే కాదు. పెళ్ల‌య్యాక‌.  ''నా జీవితంలో ఒక‌రికి చోటిచ్చాక‌.. ఇక త‌న కోస‌మే స‌మ‌యం కేటాయిస్తా. అందుకే పెళ్ల‌య్యాక సినిమాలు చేయ‌ను..'' అని చెబుతోంది. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోద‌ట‌. క‌నీసం మూడేళ్ల‌యినా ఆగాలి అంటోంది.

త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త విష‌యాల‌పై స‌మంత స్పందించింది.
''నేనెప్పుడూ అబ‌ద్ధాలు ఆడ‌లేదు. నిజాల‌ను దాచ‌లేదు. నా విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు చెబుతూనే ఉన్నా. అయితే మ‌రీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై మాత్రం స‌మాధానాలు చెప్ప‌డం ఇష్టం లేదు. సిద్దూ గురించి అంద‌రూ అడుగుతున్నారు. త‌ను నాకు మంచి మిత్రుడు. అంతే.. ఆ బంధం ఎక్క‌డికి వెళ్తుందో చెప్ప‌లేను..''అంటోంది.

ప్ర‌స్తుతం సినీ జీవితం ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే పెళ్ల‌య్యాక ఎలాగూ సినిమాలు ఉండ‌వు క‌దా.. అని ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చింది స‌మంత‌.


ఒక వేళ నిజంగానే సమంత గుడ్ బాయ్ చెప్పేస్తే... కుర్రాల్లనుంచి ముసలాల్ల దాకా ఈ అమ్మడుకి ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ ఎమైపోతారో ఊహిస్తేనే చాల బాద గా ఉంది కదు.. !!!